రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైతో బీజేపీ నేతల భేటీ

Published : Mar 18, 2020, 12:24 PM IST
రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైతో బీజేపీ నేతల భేటీ

సారాంశం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిపై సౌందర రాజన్‌ను బుధవారం నాడు బీజేపీ నేతలు రాజ్‌భవన్‌లో కలిశారు. 


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిపై సౌందర రాజన్‌ను బుధవారం నాడు బీజేపీ నేతలు రాజ్‌భవన్‌లో కలిశారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  సీఏఏకు వ్యతిరేకంగా ఇటీవల కాలంలో అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయడంపై  బీజేపీ తీవ్రంగా మండిపడింది. 

బీజేపీ నేతలు డాక్టర్ లక్ష్మణ్, రాంచంద‌ర్ రావు, మోత్కుపల్లి నరసింహులు, రాంచంద్రారెడ్డి తదితరులు బుధవారం నాడు  రాజ్‌భవన్‌లో గవర్నర్ ను కలిశారు. రాష్ట్రంలో ఎన్‌పీఆర్‌ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని  బీజేపీ డిమాండ్ చేసింది.  కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని తప్పుబట్టింది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్