ఈసారి టికెట్ ఇస్తారో లేదో నాకే తెలియదు : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 12, 2022, 05:58 PM IST
ఈసారి టికెట్ ఇస్తారో లేదో నాకే తెలియదు : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తన టికెట్‌పైనే తనకు స్పష్టత లేదని చెప్పారు. సీఎం అవుతామని చెప్పుకునేవారు బీజేపీలో ముఖ్యమంత్రి కాలేరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ  చీఫ్ బండి (bandi sanjay)సంజయ్. వ్యక్తుల కోసం పని చేసే వారికి టికెట్లు రావన్న ఆయన.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు పనిచేస్తున్నారని ఆరోపించారు. టికెట్లు ఇప్పిస్తామని కొందరు నేతలు.. తిప్పుకుంటున్నారన్న సంజయ్.. తన టికెట్‌పైనే స్పష్టత లేదని చెప్పారు. సీఎం అవుతామని చెప్పుకునేవారు బీజేపీలో ముఖ్యమంత్రి కాలేరని వ్యాఖ్యానించారు. 

అంతకుముందు మంగళవారం ఉదయం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. Praja Sangrama Yatra యాత్రను అడ్డుకునేందుకు KCR ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తామని బండి సంజయ్ ప్రకటించారు. రైతుల ముసుగులో ప్రజా సంగ్రామ యాత్రపై  దాడులు చేసేలా KCR  కుట్ర పన్నారన్నారు. అంతేకాదు తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. 

ప్రజల కోసం  రాళ్ల దాడులనైనా భరించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. ఎదురు దాడి చేయకుండా తాము సంయమనం పాటిస్తామన్నారు.ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తామన్నారు. TRS  అరాచకాలు, అవినీతిని ఎండగట్టేందుకు ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తామన్నారు. కేసీఆర్ దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాననడం హాస్యాస్పదమన్నారు. Delhiలో గంట సేపు కూడా దీక్ష చేయలేని కేసీఆర్ దేశంలో  రాజకీయ ప్రకంపనలు ఎలా చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.

ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడతను ఈ నెల 14వ తేదీ నుండి బండి సంజయ్ ప్రారంభించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆలంపూర్ ఆలయం నుండి పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించనున్నారు. 2021 ఆగష్టు 28వ తేదీన బండి సంజయ్ తన తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను హైద్రాబాద్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రారంభించారు.  తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన హుస్నాబాద్ లో ముగించారు.   పాదయాత్ర ముగించిన తర్వాత బండి సంజయ్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్