
తెలంగాణలో బీజేపీ (bjp) అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అమలు చేస్తామన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) . ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారంలో బీజేపీ లక్ష్యమన్నారు. జైలుకెళ్తామన్న భయంతోనే సీఎం కేసీఆర్ (kcr) రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి అవకాశమిస్తే.. ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేసి చూపిస్తామని, పాతబస్తీలో హిందువుల ఘర్ వాపసీ కార్యక్రమం మొదలుపెడతామన్నారు. ఎంఐఎం (mim) గూండాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని బండి సంజయ్ చెప్పారు. యూనిఫాంతో మాత్రమే స్కూళ్లకు రావాలనడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ముస్లిం మహిళలు ఓటు హక్కు వినియోగించకుండా.. ఫత్వా జారీచేసే పరిస్థితికి ఎంఐఎం వచ్చిందని బండి సంజయ్ విమర్శించారు.
తెలంగాణ కాషాయ అడ్డా అన్న ఆయన.. బీజేపీ అధికారంలోకి వచ్చాక దారూసలాంను ఆక్రమిస్తామంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. అవకాశం ఇస్తే.. ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేసి చూపిస్తామని పేర్కొన్నారు. భాగ్యనగరానికి ఐకాన్‌గా భాగ్యలక్ష్మీ దేవాయం నిలిచిందన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని పునర్మిర్మాణం చేస్తామని బండి సంజయ్ వెల్లడించారు. యూనిఫాంతో మాత్రమే పాఠశాలకు రావాలనటంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం ఆడగాలపై ముస్లిం సమాజం ఆలోచించాలని.. టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని బండి సంజయ్ స్పష్టం చేశారు.
అంతకుముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ (srinivas goud) హత్యకు కుట్రపై బండి సంజయ్ (bandi sanjay) స్పందించారు. ఐపీఎస్‌లు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. హత్యకేసును మహిళకు ముడిపెట్టడం బాధాకరమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అవినీతిని బయటకు తీస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఇద్దరు నేతల పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని.. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మంత్రి అవినీతిపై వాళ్ల దగ్గర పూర్తి ఆధారాలున్నాయని.. సీఎం డైరెక్షన్‌లోని కుట్ర జరిగిందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జితేందర్ రెడ్డి (jithender reddy) ఇంటికెళ్లి దాడి చేయాల్సిన అవసరం ఏముందని బండి సంజయ్ ప్రశ్నించారు. పోలీసుల తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. నటనలో పోలీసులు జీవిస్తున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. మంత్రి అవినీతి బండారం బయటపడుతుందని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి డిప్రెషన్‌లో పడ్డారని.. సర్వేలన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయని ఆయన చెప్పారు.