కరోనా వ్యాపిస్తోంది, సచివాలయాన్ని హాస్పిటల్ చెయ్యండి: కేసీఆర్ కు బండి సంజయ్ సూచన

By Arun Kumar PFirst Published Mar 24, 2020, 5:11 PM IST
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాజకీయాలను పక్కనపెట్టి తెలంగాణ ప్రభుత్వానికి సహకరించడానికి బిజెపి సిద్దంగా వుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ వెల్లడించారు. 

హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా వుంది.  తెలంగాణలో అయితే ఇప్పటికే ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య 36 చేరుకుంది. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ప్రభుత్వానికి సహకరించాల్సిన సమయం ఇదని... బిజెపి పార్టీ ఇందుకు సిద్దంగా వుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. 

ఈ మహమ్మారి  అదుపు చేయడానికి రాష్ట్ర సెక్రటేరియన్ ను ఉపయోగించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సలహా ఇచ్చారు. ''గౌరవనీయులైన తెలంగాణ సీఎంవో గారికి, ఒకవేళ రాష్ట్రంలో కోవిడ్19 బాధితుల సంఖ్య పెరిగితే హైదరాబాద్ లో ప్రస్తుతం  ఖాళీగా వున్న రాష్ట్ర సెక్రటేరియట్ లోని కొన్ని భవనాలను ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించాలని నేను అభ్యర్థిస్తున్నాను'' అంటూ సోషల్ మీడియా ద్వారా సీఎం కేసీఆర్ కు సూచించారు. 

అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంజయ్ ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో వుండటం వల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని... మరీ ముఖ్యంగా కూరగాయలు, నిత్యావసర ధరలను వ్యాపారులు ఒక్కసారిగా పెంచేశారని అన్నారు. కాబట్టి వీటిని నియంత్రించేందుకు ప్నత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని ఆయేష్మాన్ భారత్ లో రాష్ట్రం భాగస్వామ్యం అయితే బాగుంటుందని సూచించారు. 

ఇక కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో క్రమశిక్షణ కలిగిన బిజెపి కార్యకర్తలు ప్రభుత్వానికి ఎలాంటి సహకారమైనా అందించడానికి సిద్దంగా వున్నారని అన్నారు. వారి సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు. కరోనా మహమ్మారిని రాష్ట్రంనుండి పారదోలడానికి బిజెపి కార్యకర్తలు స్వచ్చందంగా ముందుకు రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. 
 

click me!