మానవత్వం చాటుకున్న బండి సంజయ్.. ప్రశంసలు

Published : Dec 30, 2020, 07:56 AM ISTUpdated : Dec 30, 2020, 08:03 AM IST
మానవత్వం చాటుకున్న బండి సంజయ్.. ప్రశంసలు

సారాంశం

బండి సంజయ్ కి రాజకీయం మాత్రమే కాదు.. మానవత్వం కూడా బాగా తెలుసు. తాజాగా.. ఓ మహిళ విషయంలో ఆయన చేసిన పని పట్ల ప్రస్తుత్వం సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయాల్లో చాలా చురుకుగా ఉంటారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పై ఎప్పటికప్పుడు విమర్శలు కురిపిస్తూనే ఉంటారు. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. ఆ కృషికి ఫలితం దుబ్బాక ఎన్నికలు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయమే తెలియజేస్తోంది.

ఈ సంగతి పక్కన పెడితే.. బండి సంజయ్ కి రాజకీయం మాత్రమే కాదు.. మానవత్వం కూడా బాగా తెలుసు. తాజాగా.. ఓ మహిళ విషయంలో ఆయన చేసిన పని పట్ల ప్రస్తుత్వం సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే.. ఫిట్స్‌ వచ్చి ఓ మహిళ రోడ్డుపై పడింది. పక్కనే ఉన్న కుమార్తె ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. అదే సమయంలో  జహీరాబాద్‌ నుంచి పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆ పార్టీ నాయకులతో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరారు. 

ఈ క్రమంలో చందానగర్‌కు రాగానే రోడ్డు పక్కన పడి ఉన్న మహిళను గమనించి, కారు దిగి ఆమె చేతిలో కారు తాళాలు పెట్టి కోలుకునే వరకు అక్కడే ఉండి మానవత్వాని చాటుకున్నారు. ఆ మహిళ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి  వెళ్లిపోయారు.
 

PREV
click me!

Recommended Stories

Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video