అసెంబ్లీ పెట్టండి.. రైతు చట్టాలు రద్దు చేయమనండి: కేసీఆర్‌కు కోదండరాం డిమాండ్

By Siva KodatiFirst Published Feb 6, 2021, 7:53 PM IST
Highlights

కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ కోదండరాం. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఏర్పాటు చేసి రైతు వ్యతిరేక బిల్లుపై తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ కోదండరాం. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఏర్పాటు చేసి రైతు వ్యతిరేక బిల్లుపై తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని కోదండరాం కోరారు.

కాంట్రాక్ట్ టీచర్లను ప్రభుత్వం వేధిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఖాళీ పోస్టులన్నీ తక్షణమే భర్తీ చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని... కానీ ఎందరో నిరుద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వుందని కోదండరామ్ ఎద్దేవా చేశారు. 

కొద్దిరోజుల క్రితం ఖమ్మంలో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, పీఆర్సీని అమలు చేయడంలో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. తెలంగాణ సాధన కోసం ఉద్యోగులు ఎంతో పోరాడారని, వారిని విస్మరిస్తే భూస్థాపితం కాక తప్పదని హెచ్చరించారు.

పీఆర్సీ అమలుకు ఆర్థిక పరిస్థితి సరిగా లేదనేది ఒక సాకు మాత్రమేనన్నారు.  ధనిక రాష్ట్రమని చెప్పుకున్న కేసీఆర్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు.  

click me!