హుజురాబాద్‌ ఉపఎన్నిక.. టీఆర్ఎస్ ఓడిపోతే రాజీనామా చేస్తారా: కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

By Siva KodatiFirst Published Oct 3, 2021, 3:52 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోతే రాజీనామా చేస్తారా అని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని.. ఆయన ఉద్యమం చేయలేదని, దొంగ దీక్ష చేశారని సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం పట్ల బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు టీఆర్ఎస్ నేత, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఎద్దేవా చేశారు. అయన పాదయాత్రలో ఎటు చూసినా పచ్చదనమే కనిపించిందని.. అందుకే సంజయ్‌కు ఏమి మాట్లాడాలో తెలియలేదని వినోద్ చురకలు వేశారు.

విద్య, వైద్య రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరూ చెప్పాల్సిన పని లేదని  ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు 5 మెడికల్ కళాశాలలుంటే ఇప్పుడు 9 కాలేజీలు ఉన్నాయని.. మరో  నాలుగు కళాశాలలను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వినోద్ కుమార్ వెల్లడించారు. పార్లమెంట్‌లో బండి సంజయ్‌ తెలంగాణ కోసం ఏం మాట్లాడారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.  
 
click me!