స్పీకర్ పై వ్యాఖ్యలు: బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు నోటీసులిచ్చే చాన్స్

By narsimha lodeFirst Published Sep 7, 2022, 11:02 AM IST
Highlights


బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం  శ్రీనివాస్ రెడ్డి నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. స్పీకర్ ను మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతుంది. 

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. స్పీకర్ పై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై నోటీసును ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతుంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 6వ తేదీన ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశమైన వెంటనే మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపిన తర్వాత ఈ నెల 12వ తేదీకి అసెంబ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానకి బీజేపీ ఎమ్మెల్యేలకు ఆహ్వానించలేదు. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారని తమకు సమాచారం ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో తెలిపారు. బీఏసీ సమావేశంలో కాకుండా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి ఎలా నిర్ణయం తీసుకొంటారని ప్రశ్నించారు. స్పీకర్ మరమనిషిలా నిర్ణయాలు తీసుకోవద్దని ఈటల రాజేందర్ స్పీకర్ ను కోరారు. స్పీకర్ ను మరమనిషిలా నిర్ణయం తీసుకోవద్దని చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతుందని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు.  వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ శాసనసభపక్షనేతగా ఉన్న రాజాసింగ్ పై ఆ పార్టీ సస్పెన్షన్ వేటేసింది. పార్టీ పదవులన్నింటి నుండి రాజాసింగ్ ను తొలగిస్తున్నట్టుగా బీజేపీ ప్రకటించింది. రాజాసింగ్ పీడీ యాక్ట్ కేసులో జైలులో ఉన్నాడు. అయితే స్పీకర్ ను మరమనిషిగా నిర్ణయం తీసుకోవద్దని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ నోటీసులు పంపుతారనే ప్రచారం కూడా రాజకీయంగా చర్చకు దారి తీసింది. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతుంది
 

click me!