కేసీఆర్ పర్యవేక్షణలోనే సాగునీటి ప్రాజెక్టులు: పోచారం (వీడియో)

By Arun Kumar PFirst Published Jan 25, 2019, 8:15 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలోనే భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కొండపోచమ్మ  రిజర్వాయర్ పనులన్నీ త్వరితగతిన పూర్తవుతాయని అన్నారు. వచ్చే వానాకాలం నాటికి గోదావరి జలాలు కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా నిజాంసాగర్ చేరుకుంటాయని స్పీకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో నిర్మిస్తున్న కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ పనులను స్పీకర్ ఇవాళ సందర్శించారు.ముఖ్యమంత్రి కెసిఆర్ ఎర్రవల్లి గ్రామ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తున్న సహస్ర మహా చండీయాగంలో స్పీకర్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా కొండ పోచమ్మ సాగర్ ను సందర్శించారు. 

15టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నట్లు ఇంజనీర్లు పోచారంకు వివరించారు. ఈ రిజర్వాయర్  ద్వారానే కామారెడ్డి జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు, నిజాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి నీళ్ళు వస్తాయన్నారు. కొండపోచమ్మ సాగర్ నుండి కాలువల ద్వారా నీటిని తరలించి హల్ధీ వాగులో కలపడం ద్వారా గోదావరి జలాలు నేరుగా నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి చేరుకుంటాయని ఇంజనీర్లు స్పీకర్ కు వివరించారు. 

ఇప్పటికే రిజర్వాయర్ నిర్మాణం 90 శాతం పూర్తయిందని నీటిని తరలించే కాలువల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నట్లు సాగునీటి శాఖ ఇంజనీర్లు, అధికారులు పోచారంకు తెలిపారు.  రిజర్వాయర్ పనులు ముమ్మరంగా జరగడంపై పోచారం సంతృప్తి వ్యక్తం చేశారు. 

వీడియో

"

click me!