తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా సవాల్

By narsimha lodeFirst Published Sep 6, 2021, 8:47 PM IST
Highlights


తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చూపిస్తే తాను ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తానని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.


నిజామాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలోని జరగని అభివృద్ది తెలంగాణలో జరుగుతుందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో  జరిగినట్టు నిరూపిస్తే  తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు.

సోమవారం నాడు కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం దామరంచ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా  ఆయన పాల్గొన్నారు.నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, 10 డబుల్ బెడ్ రూం ఇల్లు, ఎస్సీ కమ్యునిటీ భవనం, ముదిరాజ్ సంఘం భవనాలను స్పీకర్ ప్రారంభించారు.

కాంగ్రెస్, బీజేపీ నేతలు రాష్ట్రంలో అభివృద్ది విషయమై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయాలు హుందాగా ఉండాలి. మైకు దొరకగానే విమర్శలు చేసే ముందు మీ జాతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇలాంటి అభివృద్ధి చేసి, సంక్షేమ పథకాలను అమలుచేసి ఇక్కడ మాట్లాడాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి హితవు పలికారు.


దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని  స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గానికి మాత్రమే పదివేల ఇండ్లు మంజూరు అయ్యాయన్నారు. మరో అయిదువేల ఇండ్లను తెచ్చి మిగిలిన పేదలందరికి మంజూరు చేస్తానన్నారు. నియోజకవర్గ పరిధిలో సొంత ఇల్లు లేని పేదలందరికి స్వంత ఇంటి కలను నిజం చేయడమే తన ఆశయమని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

click me!