బీఆర్‌ఎస్ దోచుకున్న ప్ర‌జా సొమ్మునంతా క‌క్కిస్తాం.. : రాహుల్ గాంధీ

By Mahesh Rajamoni  |  First Published Nov 1, 2023, 10:59 PM IST

Telangana Assembly Elections 2023: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ రాహుల్ గాంధీ అన్నారు. ఇదే స‌మ‌యంలో బీఆర్ఎస్, బీజేపీల‌ను టార్గెట్ చేస్తూ ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీఆర్ఎస్ దోచుకున్న ప్ర‌జా సొమ్మునంతా క‌క్కిస్తామ‌ని అధికార పార్టీ నియ‌కుల అవినీతి అంశాన్ని లేవ‌నెత్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని విమ‌ర్శించారు.
 


Congress senior leader Rahul Gandhi: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ రాహుల్ గాంధీ అన్నారు. ఇదే స‌మ‌యంలో బీఆర్ఎస్, బీజేపీల‌ను టార్గెట్ చేస్తూ ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీఆర్ఎస్ దోచుకున్న ప్ర‌జా సొమ్మునంతా క‌క్కిస్తామ‌ని అధికార పార్టీ నియ‌కుల అవినీతి అంశాన్ని లేవ‌నెత్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని విమ‌ర్శించారు.

వివ‌రాల్లోకెళ్తే.. నాగర్ కర్నూల్ కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అధికార పార్టీ బీఆర్ఎస్, ప్ర‌తిపక్ష బీజేపీల‌పై ఘాటు వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శ‌ల దాడి చేశారు. "కేసీఆర్‌కు బై బై చెబుతాము.. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), దాని అవినీతి మంత్రులు మా ప్రజల నుండి దోచుకున్న సొమ్మును వారి బ్యాంకు ఖాతాలకు తిరిగి ఇచ్చేలా చూస్తాం అని రాహుల్" అని అన్నారు. బీఆర్ఎస్ స‌ర్కారు అవినీతిలో కూరుకుపోయింద‌ని ఆరోపించారు. ఎక్సైజ్‌, భూ రెవెన్యూ, ఇసుక తవ్వకం వంటి ఆదాయాన్ని సమకూర్చే శాఖలపై సీఎం కేసీఆర్, ఆయ‌న కుటుంబం గుత్తాధిపత్యం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజల నుంచి లక్ష కోట్లు దోచుకుని త‌క్కువ కాలంలోనే శిథిలావస్థకు చేరుకుంటున్న ప్రాజెక్టును నిర్మించారని విమర్శించారు. ప్రజాధనంతో కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లకు పైగా ప్రాజెక్టుగా మార్చార‌నీ, తెలంగాణలోని ప్రతి కుటుంబం 2040 వరకు ఏటా రూ.31,500 అప్పు భారంలో ప‌డేలా చేశార‌ని విమ‌ర్శించారు.

Latest Videos

undefined

"మేము కూడా ప్ర‌భుత్వాన్ని నడిపించాము. నాగార్జున సాగర్, జూరాల, సీనూరు వంటి ప్రాజెక్టులు కూడా నిర్మించాం. దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని" అన్నారు. ఇదే క్ర‌మంలో బీజేపీని కూడా టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ.. హామీలు ఇచ్చి వెనుక‌డుగు వేయ‌మ‌నీ, తాము వాటిని త‌ప్ప‌కుండా నెర‌వేర్చుతామ‌ని అన్నారు. "నేను ప్ర‌ధాని మోడీని కాదు.. ఆయ‌నలా అవి ఇవి చేస్తాన‌ని చెప్పి.. వెన‌క్కి త‌గ్గ‌ను. నేను వాగ్దానం చేసినప్పుడు త‌ప్ప‌కుండా దానిని నెరవేరుస్తాను. 15 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జ‌మ‌ చేస్తానని మోడీ చెప్పారు. కానీ, మీరు ఏమీ పొంద‌లేక‌పోయారు.. అయితే, అదానీకి వేల కోట్ల రూపాయలు మాత్రం వ‌చ్చాయి.." అని రాహుల్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక బీసీ సీఎం అంటూ బీజేపీ చేస్తున్న వాగ్దానాల‌ను ప్ర‌స్తావిస్తూ.. "రాష్ట్ర ఎన్నికల తర్వాత ఓబీసీని సీఎం చేస్తానని బీజేపీ ఎందుకు గొప్పలు చెబుతుందో అర్థం కావడం లేదు. బీజేపీకి కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి. 2% ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఓబీసీని ముఖ్యమంత్రిని ఎలా చేస్తారో నాకు అర్థం కావడం లేదంటూ" వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ను అడ్డుకోవ‌డానికి ఆ మూడు పార్టీలు క‌లిశాయి.. 

బీజేపీ, బీఆర్ఎస్, ఏఐఎంఐఎం చేతులు కలిపి పనిచేస్తున్నాయ‌ని ఆరోపించిన రాహుల్ గాంధీ.. ఎన్నికల సమయంలో తరచూ వచ్చే ఎంఐఎం అభ్యర్థులు బీజేపీ మద్దతుదారులేనని ఆయన పేర్కొన్నారు. వారు బీజేపీకి 24×7 సహాయం చేస్తార‌నీ, ప్రతిగా బీజేపీ వారికి నిధులు సమకూరుస్తుందని ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీపై బీఆర్ఎస్, ఏఐఎంఐఎం బీజేపీకి మద్దతిచ్చాయని రాహుల్ అన్నారు. "కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై బీజేపీ కేసులు పెడుతోంది. నాపై 24 ఈడీ, ఆదాయపు పన్ను, విజిలెన్స్ కేసులు ఉన్నాయి. వారు నా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కానీ అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్ నేతలపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని" ప్ర‌శ్నించారు.

click me!