కాంగ్రెస్ తొలి జాబితా సిద్దం.. 70 మంది అభ్యర్థులు ఖరారు.. రేపే ప్రకటన..!

By Sumanth Kanukula  |  First Published Oct 14, 2023, 1:06 PM IST

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలి జాబితాను రేపు విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయినట్టుగా తెలుస్తోంది.


తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలి జాబితాను రేపు విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయినట్టుగా తెలుస్తోంది. తొలి జాబితాలను దాదాపు 70 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. ఈ జాబితాకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీఈసీ ఆమోదం కూడా తెలిపిందని.. అయితే మంచి రోజులు ప్రారంభం అవుతున్నందున రేపే జాబితా ప్రకటన చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పార్టీలోని ముఖ్య నేతల పేర్లు దాదాపుగా మొదటి జాబితాలోనే వచ్చే అవకాశం ఉంది. 

తెలంగాణలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిందని ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కె మురళీధరన్ చెప్పారు. అక్టోబర్ 18న పార్టీ బస్సుయాత్ర ప్రారంభమయ్యేలోపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. సీపీఐ, సీపీఎంలతో పొత్తు చర్చలు కొనసాగుతున్నాయని.. అవి శనివారంతో ముగుస్తామని భావిస్తున్నామని మురళీధరన్‌ స్పష్టం చేశారు. ఆ చర్చలు పూర్తయిన తర్వాత..  మిగిలిన అభ్యర్థులను నిర్ణయించడానికి కేంద్ర ఎన్నికల కమిటీ మళ్లీ సమావేశమవుతుందని చెప్పారు. 

Latest Videos

undefined

ఇదిలా ఉంటే, పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేరసిన సంగతి తెలిసిందే. సర్వేల నివేదికలు, ఆర్థిక బలం, పార్టీకి విధేయత, పార్టీ లో పనిచేసిన కాలం.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను కాంగ్రెస్ సీఈసీ ఎంపిక చేసింది. అయితే కాంగ్రెస్ సీఈసీ సమావేశానికి ముందు.. అభ్యర్థుల జాబితాను రూపొందించడానికి స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా నాలుగు గంటలపాటు సమావేశం నిర్వహించింది. మురళీధరన్‌ అధ్యక్షతన జరిగిన భేటీలో కమిటీ సభ్యులు జిగ్నేష్‌ మేవానీ, బాబా సిద్ధిఖీ, కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ, ఏఐసీసీ కార్యదర్శులు, పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు పాల్గొన్నారు. ఆ నివేదికను కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించింది.

పొత్తులపై..
మరోవైపు సీపీఎం, సీపీఐలతో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ అతి త్వరలో ఓ నిర్ణయం తీసుకునే ఉంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్.. వామపక్షాల ముఖ్యనేతలతో చర్చలు జరుపుతున్నారు. వారికి నాలుగు సీట్లు  ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మరో రెండు స్థానాలు కూడా ఇవ్వాలని కమ్యూనిస్టులు పట్టుబడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరో దఫా చర్చలు జరగనున్నాయి. అయితే ఒక్కట్రెండు రోజుల్లో ఈ పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

click me!