దేశ రక్షణ కోసం అమరుడైన తెలంగాణ జవాన్

By Nagaraju TFirst Published Dec 25, 2018, 11:15 AM IST
Highlights

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లిలో విషాదం నెలకొంది. తనకు జన్మనిచ్చిన మాతృభూమి రుణం తీర్చుకోవాలంటూ భారత ఆర్మీలో చేరిన తెలంగాకు చెందిన జవాన్ అమరుడయ్యాడు. దేశంలో ఉగ్రవాదులు చొరబడకుండా ఉండేందుకు, దేశాన్ని రక్షించేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టి బలయ్యాడు.

ఆసిఫాబాద్‌: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లిలో విషాదం నెలకొంది. తనకు జన్మనిచ్చిన మాతృభూమి రుణం తీర్చుకోవాలంటూ భారత ఆర్మీలో చేరిన తెలంగాకు చెందిన జవాన్ అమరుడయ్యాడు. దేశంలో ఉగ్రవాదులు చొరబడకుండా ఉండేందుకు, దేశాన్ని రక్షించేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టి బలయ్యాడు. 

దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేస్తానంటూ పలుమార్లు దేశభక్తిని పెంపొందిస్తూ ఆయన చెప్పిన మాటలను అక్షరాల నిజం చేశారు. దేశంలోకి ఉగ్రవాదులు చొరబడటాన్ని గమనించి వారిపై కాల్పులు జరిపాడు. ఆ ఎదురు కాల్పుల్లో తనువు చాలించాడు.

వివరాల్లోకి వెళ్తే కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతమానేపల్లికి చెందిన దక్వా రాజేష్‌ శ్రీనగ్‌ర్‌లో ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో రాజేష్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాజేష్‌ స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

జమ్మూ కశ్మీర్‌లో గత కొంతకాలంగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేష్‌ మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రానికి రాజేష్ మృతదేహం స్వగ్రామానికి చేరే అవకాశం ఉందని బంధువులు తెలిపారు. 

click me!