తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఆంక్షలు..

By AN TeluguFirst Published May 11, 2021, 9:59 AM IST
Highlights

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో తెలంగాణ పోలీసుల ఆంక్షలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6వరకు ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో తెలంగాణ పోలీసుల ఆంక్షలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6వరకు ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 

ఈ నెల 18 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్లా రామాపురం (కోదాడ), నల్గొండ జిల్లా కొందుగుల (వాడపల్లి), నాగార్జున సాగర్ (మాచర్లవైపు) మూడు చెక్ పోస్టుల వద్ద తెలంగాణ పోలీసులు తనిఖీలు చేపట్టారు. 

ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను తెలంగాణలోకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. తెలంగాణలోని ఆసుపత్రుల్లో రెఫరెన్స్ లెటర్, బెడ్ కన్ఫర్మ్ ఉంటేనే కోవిడ్ పేషెంట్లకు తెలంగాణలోకి అనుమతి ఇస్తున్నారు. 

ప్రభుత్వఆదేశా మేరకే విధుల్లో ఉన్నామని పోలీసులు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో కరోనా పేషంట్లు హైదరాబాద్ కు వస్తుండడంతో తెలంగాణ పోలీసులు వారిని సరిహద్దుల్లో ఆపేస్తున్నారు. ఏపీ సరిహద్దును దాటి వస్తున్న పేషంట్లను తెలంగాణ పోలీసులు ఆపేస్తున్నారు.

ఈ మేరకు రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర చెక్ పోస్ట్  ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి వస్తున్న పేషంట్లను తెలంగాణలోకి అనుమతించడం లేదు. తెలంగాణలోని ఆస్పత్రుల్లో అనుమతులు పొందిన వారికి మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. 

సాధారణ ప్రయాణీకులను మాత్రం తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకే సోమవారం ఉదయం నుంచి ఈ నిర్భంధాన్ని అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

click me!