పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మెన్ పుట్ట మధుకు రామగుండం పోలీసులు మంగళవారం నాడు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు రావాలని ఆదేశించారు.
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మెన్ పుట్ట మధుకు రామగుండం పోలీసులు మంగళవారం నాడు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు రావాలని ఆదేశించారు. మూడు రోజుల పాటు విచారణ నిర్వహించిన పోలీసులు సోమవారం నాడు రాత్రి పుట్ట మధును ఇంటికి పంపారు. లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో అందిన ఫిర్యాదు మేరకు పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహించారు.
మంగళవారం నాడు మరోసారి విచారణకు రావాలని పోలీసులు పుట్టమధుకు పోలీసులు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకొంది. పుట్ట మధు భార్య మంథని మున్సిపల్ ఛైర్‌పర్సన్ శైలజను కూడ పోలీసులు విచారించారు. లాయర్ వామన్ రావు దంపతుల హత్యకు రెండు రోజుల ముందు పుట్ట మధు తన బ్యాంకు ఖాతా నుండి సుమారు రూ. 2 కోట్లను డ్రా చేసిన విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
undefined
also read:అర్థరాత్రి పుట్ట మధును ఇంటికి పంపిన పోలీసులు: మూడు రోజుల విచారణ
గత వారం రోజుల వరకు పుట్ట మధు అదృశ్యం కావడంపై కూడ పోలీసులు విచారణ నిర్వహించారు. ఏ కారణం చేత పెద్దపల్లిని వదిలివెళ్లారనే విషయమై ఆరా తీశారు. మరో వైపు పుట్ట మధుతో పాటు మరో 12 బ్యాంకు ఖాతాల వివరాలపై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయాలపైనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.