రేవంత్ కు చంద్రబాబు రూ.500కోట్లు ఇచ్చాడు: సిఈవోకి ఫిర్యాదు

Published : Oct 15, 2018, 05:42 PM ISTUpdated : Oct 15, 2018, 05:58 PM IST
రేవంత్ కు చంద్రబాబు రూ.500కోట్లు ఇచ్చాడు: సిఈవోకి ఫిర్యాదు

సారాంశం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. కాంగ్రెస్ తో పొత్తుకోసం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు రూ.500కోట్లు ఇచ్చారంటూ తెలంగాణ అడ్వకేట్స్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై సిఈవో రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. రేవంత్ వ్యవహారంపై నిఘా పెట్టాలని కోరారు. 

హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. కాంగ్రెస్ తో పొత్తుకోసం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు రూ.500కోట్లు ఇచ్చారంటూ తెలంగాణ అడ్వకేట్స్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై సిఈవో రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. రేవంత్ వ్యవహారంపై నిఘా పెట్టాలని కోరారు.  

మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చుపెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఇటీవలే మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ద్వారా గెలవాలని ప్రయత్నించినట్లే ఈసారి రూ.500 కోట్లు ఖర్చుపెట్టాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఏపీ ఇంటెలిజెన్స్ ను తెలంగాణలో దించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని ఆరోపించారు. 

కేటీఆర్ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ తెలంగాణ అడ్వకేట్స్ రేవంత్ రెడ్డి, చంద్రబాబుపై సిఈవోకు ఫిర్యాదు చెయ్యడం చర్చనీయాంశంగా మారింది.   

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu