ఆ సీటు నాదే.. గెలుపు నాదే:కోమటిరెడ్డి

By Nagaraju TFirst Published Oct 15, 2018, 5:25 PM IST
Highlights

మునుగోడు సీటు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాను ఎట్టిపరిస్థితుల్లో మునుగోడు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మునుగోడులో సరైన నాయకత్వం లేదని, నియోజకవర్గం అభివృద్ధి కోసం మునుగోడు నుంచి పోటీ చేస్తానని చెప్పారు. సీపీఐ నేతలు సైతం తన పేరునే సూచిస్తున్నారని కోమటిరెడ్డి చెప్పారు. 

నల్గొండ: మునుగోడు సీటు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాను ఎట్టిపరిస్థితుల్లో మునుగోడు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మునుగోడులో సరైన నాయకత్వం లేదని, నియోజకవర్గం అభివృద్ధి కోసం మునుగోడు నుంచి పోటీ చేస్తానని చెప్పారు. సీపీఐ నేతలు సైతం తన పేరునే సూచిస్తున్నారని కోమటిరెడ్డి చెప్పారు. 

మరోవైపు పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె స్రవంతికి టికెట్ ఇస్తారన్న వార్తలపై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆమె గెలిచే పరిస్థితి లేదన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో పాల్వయి స్రవంతి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మునుగోడు టికెట్ నాదే.. ఇక్కడ గెలుపు నాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అటు మునుగోడు నియోజకవర్గంపై ఎప్పటి నుంచో కన్నేశారు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ రద్దు అయిన వెంటనే కోమటిరెడ్డి మునుగోడులో రెక్కలు కట్టుకుని వాలిపోయారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వకముందే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. మునుగోడు కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు షోకాజ్ వరకు వెళ్లాయి. 
  

click me!