అద్భుతం.. కరోనాను జయించిన 110 యేళ్ల తాత.. గాంధీ ఆస్పత్రిలో అరుదైన రికార్డ్...

By AN TeluguFirst Published May 13, 2021, 9:24 AM IST
Highlights

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. దేశంలోనే అత్యధిక వయసు కలిగిన వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాడు. అయితే అతని మరికొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతామని వైద్య అధికారులు తెలిపారు.

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. దేశంలోనే అత్యధిక వయసు కలిగిన వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాడు. అయితే అతని మరికొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతామని వైద్య అధికారులు తెలిపారు.

పూర్తి వివరాల్లోకి వెళితే రామానందతీర్థ (110) కీసరలోని ఓ ఆశ్రమం లో ఉంటున్నారు. తాజాగా స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకుఆస్పత్రి వైద్యులు చికిత్స అందించగా తాజాగా నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

రామానందతీర్థకు ఎలాంటి ఇతర జబ్బులు లేకపోవడం వల్లే ఇది సాధ్యమైందని ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని గాంధీ ఆసుపత్రి సూపర్డెంట్ రాజారావు వెల్లడించారు. అయితే ఆయన్ని మరికొన్ని రోజులు పరిశీలనలో ఉంచుతామని తెలిపారు.

కీసర లోని ఓ ఆశ్రమం లో నివసిస్తున్న రామానందతీర్థ స్వల్ప కోవిడ్ లక్షణాలతో ఏప్రిల్ 24వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో రామానందతీర్థ ఆక్సీజన్ లెవెల్స్ 92 పాయింట్స్ ఉంది. ఇప్పుడాయన కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఐసీయూ నుంచి సాధారణ వార్డు మారుస్తామని, పూర్తిస్థాయిలో కోలుకునే వరకూ ఆయనకు ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా అత్యంత పెద్ద వయసు కలిగిన వ్యక్తి.. కరోనా నుంచి కోలుకున్న అపురూప ఘటన దేశంలోనే తొలిసారి అని...  అది కూడా తెలంగాణా లోని గాంధీ ఆస్పత్రిలో రికార్డ్ అయిందని ఆసుపత్రి సూపర్డెంట్ ప్రకటించారు. 

రామానందతీర్థ రెండు దశాబ్దాల పాటు హిమాలయాల్లో నివసించి వచ్చారు. గత కొద్ది సంవత్సరాల క్రితం రామానందతీర్థ కాలికి ఆపరేషన్ జరిగింది. అది కూడా గాంధీ ఆస్పత్రిలోనే చేయించుకున్నట్లు అతను తెలిపారు.

నిరుడు గాంధీ ఆస్పత్రి మరో రికార్డును సాధించింది. జూలై 2020లో 94 సంవత్సరాల విజయలక్ష్మి కరోనాతో గాంధీలో చేరి.. కోలుకుని చక్కగా నడిచివెళ్లారు.  ఆ సంఘటన అప్పుడు విశేషంగా మారింది. అది రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన,  కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిగా రికార్డు సాధించారు. అయితే విజయలక్ష్మి కొడుకు మాత్రం కరోనాకు బలయ్యారు. 
 

click me!