మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి మాతృవియోగం

Siva Kodati |  
Published : Jul 22, 2019, 08:59 AM ISTUpdated : Jul 22, 2019, 10:29 AM IST
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి మాతృవియోగం

సారాంశం

తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సింగిరెడ్డి తారకమ్మ వృద్ధాప్యం కారణంగా సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సింగిరెడ్డి తారకమ్మ వృద్ధాప్యం కారణంగా సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 105 సంవత్సరాలు.

తారకమ్మ మరణం పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు. తారకమ్మ అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వనపర్తికి సమీపంలోని పాన్‌గల్ మండం కొత్తపేట శివారులోని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. 

తారకమ్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మంత్రి నిరంజన్ రెడ్డికి, ఇతర కుటుంబసభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?