ఉత్త భోగస్: ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ పై దండెత్తిన కేసీఆర్

By Siva Kodati  |  First Published May 18, 2020, 9:25 PM IST

కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజ్‌ను బోగస్ అని కొట్టిపారేశారు తెలంగాణ సీఎం కేసీఆర్


కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజ్‌ను బోగస్ అని కొట్టిపారేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.

కేంద్రం ప్యాకేజీ అంకెల గారడి అని అనేక అంతర్జాతీయ పత్రికలు చెప్పిన విషయాన్ని సీఎం చెప్పారు. కేంద్రం ప్రకటించిన దానిని ప్యాకేజీ అంటారా ఎవరైనా అని సీఎం ఎద్దేవా చేశారు.

Latest Videos

undefined

ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచుతూ దరిద్రపు ఆంక్షలు పెట్టారని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందని సీఎం ఆరోపించారు. కేంద్ర ప్రకటించిన ప్యాకేజీ దగా, మోసంగా ఆయన అభివర్ణించారు. ఆ

ర్ధికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తారా అని సీఎం కేంద్రాన్ని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కేంద్రం తీరు జనాలకు తెలియకుండా ఉండదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

మున్సిపాలిటీల్లో ఛార్జీలు పెంచితే రుణ పరిమితి పెంచుతారా..? దీనిని అసలు ప్యాకేజీ అంటారా అని కేసీఆర్ విమర్శించారు. మెడ మీద కత్తి పెట్టి ఇది చెయ్యి.. అది చెయ్యి అని చెప్పడం ప్యాకేజీనా..? ఆ నిబంధనలు అమలు చేస్తేనే రుణాలు ఇస్తామంటే అవి మాకు అక్కర్లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. 

click me!