అందరికీ భూములు ఇస్తూపోతారా: దర్శకుడు శంకర్ కేసులో తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఫైర్

By Siva KodatiFirst Published Aug 27, 2020, 3:39 PM IST
Highlights

సినీ దర్శకుడు శంకర్‌కు భూమి కేటాయింపుపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. రెండున్నర కోట్ల రూపాయల విలువైన భూమి పాతిక లక్షలకే ఎలా కేటాయిస్తారని కోర్టు ప్రశ్నించింది

సినీ దర్శకుడు శంకర్‌కు భూమి కేటాయింపుపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. రెండున్నర కోట్ల రూపాయల విలువైన భూమి పాతిక లక్షలకే ఎలా కేటాయిస్తారని కోర్టు ప్రశ్నించింది.

తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలక పాత్ర పోషించారని ఏజీ కోర్టుకు  తెలిపారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన వేల మందికి ఇలాగే ఇస్తారని న్యాయస్థానం నిలదీసింది.

హైదరాబాద్‌లో ఇప్పటికే రామోజీ ఫీల్మ్ సిటీ ఉందని హైకోర్టు గుర్తుచేసింది. ప్రభుత్వమే సొంతంగా స్టూడియో నిర్మించవచ్చు కదా అని ప్రశ్నించింది. ప్రభుత్వ భూముల్ని సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

కేబినెట్  నిర్ణయాలకు సహేతుకత ఉండాలని, ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇవ్వరాదంటూ ధర్మాసనం సూచించింది. ఈ కేసులో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి రెండు వారాల గడువిస్తూ, విచారణను వాయిదా వేసింది. 

click me!