కరోనా ఎఫెక్ట్: తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా

By narsimha lodeFirst Published Sep 16, 2020, 4:13 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం నాడు ప్రకటించారు.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం నాడు ప్రకటించారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 28వ తేదీవరకు నిర్వహించాలని తొలుత బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. అయితే  అసెంబ్లీ  సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలు, సిబ్బందికి కరోనా సోకడంతో  అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొన్నారు. 

ఇద్దరు ఎమ్మెల్యేలు, పోలీసులు, అసెంబ్లీ సిబ్బందికి కరోనా సోకింది. అసెంబ్లీ పాసులు జారీ చేసే సిబ్బందిలో ఒకరికి కూడ కరోనా సోకింది. మరోవైపు ఓ ఎమ్మెల్యే కూడ కరోనా బారినపడ్డారు.

దీంతో కరోనా కేసులు పెరిగి పోయే అవకాశం ఉన్నందున శాసనసభను వాయిదా వేశారు.  ఈ మేరకు ఈ నెల 15వ తేదీన అన్ని పార్టీల నేతలతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చర్చించారు.  పలు అంశాలను చర్చించాల్సిన అవసరాన్ని విపక్ష సభ్యులు గుర్తు చేశారు. అయితే సభ్యుల జాగ్రత్త దృష్ట్యా అసెంబ్లీని వాయిదా వేయాలని నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. దీంతో ఇవాళ ముందుగా నిర్ణయం తీసుకొన్నట్టుగా  అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
 

click me!