ప్రియుడి బ్లాక్‌మెయిల్:రైలుకు ఎదురెళ్లి హైద్రాబాద్‌లో టెక్కీ సూసైడ్

Published : Oct 12, 2020, 08:46 PM IST
ప్రియుడి బ్లాక్‌మెయిల్:రైలుకు ఎదురెళ్లి  హైద్రాబాద్‌లో టెక్కీ సూసైడ్

సారాంశం

 ప్రియుడి వేధింపులు భరించలేక టెక్కీ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది.

హైదరాబాద్: ప్రియుడి వేధింపులు భరించలేక టెక్కీ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది.

హైద్రాబాద్ లోని మేడిపల్లికి చెందిన టెక్కీ శ్వేత ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తోంది.  ఆమెకు అజయ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ కూడ పెళ్లి చేసుకోవాలని భావించారు.

తనను పెళ్లి చేసుకొనేందుకు అజయ్ అంగీకరించడంతో శ్వేత ఆనంధానికి అవధులు లేకుండాపోయాయి. అయితే ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.శ్వేత వ్యక్తిగత ఫోటోలను అజయ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే  ఈ ఫోటోలను డిలీట్ చేయాలని ఆమె కోరింది. అయితే అజయ్ అంగీకరించలేదు. పైగా శ్వేతను బ్లాక్ మెయిల్ చేశాడు.

ఈ వేధింపులు భరించలేక శ్వేత పోలీసులను ఆశ్రయించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో శ్వేత నడుస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకొంది.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. అజయ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 


అజయ్

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!