కామాంధుడి అకృత్యం: ప్రసవం చేసిన తల్లి, బాలికతో సహా శిశువు మృతి

Published : Oct 12, 2020, 06:57 PM IST
కామాంధుడి అకృత్యం: ప్రసవం చేసిన తల్లి, బాలికతో సహా శిశువు మృతి

సారాంశం

ఓ కామాంధుడి కారణంగా మైనర్ బాలిక గర్భం దాల్చింది. పురుటి నొప్పులు రావడంతో తల్లి ప్రసవం చేయడానికి ప్రయత్నించింది. దాంతో జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆ బాలిక సహా శిశువు మరణించింది.

హైదరాబాద్: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో ఓ కామాంధుడు మోసం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. విషయం బయటకు తెలియకూడదనే ఉద్దేశంతో ప్రసవం చేయడానికి తల్లి చేసిన ప్రయత్నం వికటించింది. జగిత్యాల జిల్లా దర్మపురిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

పురుటి నొప్పులు రావడంతో బాలిక తల్లి ఇంట్లోనే సొంత వైద్యం చేసింది. దాంతో బాలికతో సహా శిశువు మరణించింది. రెండు రోజుల క్రితం గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాలను పూడ్చి పెట్టారు. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 

సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. శవాలను వెలికి తీశారు. బాలిక మృతికి కారణమైన ఆమె తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై స్థానికలు, దళిత సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

భార్యను సజీవ దహనం చేసిన భర్త

తెలంగాణ రాజధాని హైదరాబాదులో మరో ఘోరం జరిగింది. అ వ్యక్తి తన భార్యను సజీవ దహనం చేశాడు. ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉన్నావని నిలదీసిన భార్య లక్ష్మికి భర్త వెంకన్న నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మి మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మి భర్త వెంకన్నను పోలీసులు అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?