ఉద్యోగం నుండి తొలగింపు: భువనగిరిలో టెక్కీ సూసైడ్

By narsimha lodeFirst Published Sep 22, 2020, 2:09 PM IST
Highlights

యాదాద్రి భువనగరి జిల్లాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్  మంగళవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం ఆయనను కంపెనీ ఉద్యోగం నుండి తీసివేసింది. దీంతో మనోవేదనకు గురైన అభిలాష్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

భువనగరి: యాదాద్రి భువనగరి జిల్లాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్  మంగళవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం ఆయనను కంపెనీ ఉద్యోగం నుండి తీసివేసింది. దీంతో మనోవేదనకు గురైన అభిలాష్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో కుటంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  భువనగిరి పట్టణానికి చెందిన అభిలాష్ బెంగుళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా పనిచేస్తున్నాడు.

కరోనా నేపథ్యంలో కొంతకాలం క్రితం ఆయన స్వగ్రామానికి చేరుకొన్నారు. ఇంటి నుండే విధులను నిర్వహిస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఆయనను ఉద్యోగం నుండి సాఫ్ట్ వేర్ కంపెనీ తొలగించింది.

ఉద్యోగం పోవడంతో మనోవేదనకు గురైన  అభిలాష్ మంగళవారం నాడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో పోలీసులు క్లూస్ ను సేకరించారు. ఉద్యోగం పోవడమే కారణమా... ఇంకా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!