
నిజామాబాద్: పట్టణంలోని మోడ్రన్ స్కూల్ లో విద్యార్ధినుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్నవిద్యార్ధినుల పేరేంట్స్ శుక్రవారంనాడు స్కూల్ కు వచ్చి ఉపాధ్యాయుడు వెంకటరమణను చితకబాదారు.
మోడ్రన్ స్కూల్‌లో సైన్స్ టీచర్ గా వెంకటరమణ పనిచేస్తున్నారు. వెంకటరమణ పాఠాలు బోధించే సమయంలో విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేరేంట్స్ ఆరోపిస్తున్నారు.అంతేకాదు వెంకటరమణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు.