ప్రభుత్వాస్పత్రిలో టీ కొట్టు యజమాని ట్రీట్మెంట్....

By sivanagaprasad KodatiFirst Published Aug 26, 2018, 12:17 PM IST
Highlights

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు లేకపోతే నర్సులు వైద్యం చేస్తారు....వాళ్లు లేకపోతే అటెండర్లు చేస్తారు...చివరకు ఆయాలు కూడా వైద్యం చేసిన సంఘటనలు ఎన్నో చూశాం. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాం.... ఇవన్నీ ఒక ఎత్తైతే మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి మరీ దారుణం. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వాస్పత్రిలో ఓ టీకొట్టు యజమాని ఏకంగా వైద్యుడి అవతారం ఎత్తేశాడు. 

మంచిర్యాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు లేకపోతే నర్సులు వైద్యం చేస్తారు....వాళ్లు లేకపోతే అటెండర్లు చేస్తారు...చివరకు ఆయాలు కూడా వైద్యం చేసిన సంఘటనలు ఎన్నో చూశాం. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాం.... ఇవన్నీ ఒక ఎత్తైతే మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి మరీ దారుణం. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వాస్పత్రిలో ఓ టీకొట్టు యజమాని ఏకంగా వైద్యుడి అవతారం ఎత్తేశాడు. 

టీ కొట్టు యజమాని రోగులకు చేస్తున్న ట్రీట్మెంట్ వీడియో కలకలం రేపుతోంది. టీ కొట్టు యజమాని లతీఫ్ రోగులకు ఇంజక్షన్ చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే ఆస్పత్రి ముందే టీ కొట్టు నిర్వహించే లతీఫ్ అనే వ్యక్తికి ప్రభుత్వాస్పత్రిలోని వైద్యులతో సన్నిహిత సంబంధాలున్నాయి. వైద్యులతో సత్సమ సంబంధాలున్న లతీఫ్ ఆస్పత్రిలో ఆడింది ఆట పాడింది పాటగా చెలామణి అవుతుంది. ఆస్పత్రిలో యజమాయిషీ చేస్తున్నాడు. ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతుండటంతో ఆ వైద్యుడి తరఫున టీ కొట్టు యజమాని ఆస్పత్రిలో వ్యవహారం నడుపుతుంటాడు.

 టీకొట్టు యజమాని వైద్యం వ్యవహారం మిగతా సిబ్బంది చూసినా మిన్నకుండిపోతున్నారు. ఈ ప్రాంతంలో విషజ్వరాలు ప్రబలి ఇప్పటికే ఆరుగురు మరణించారు. ఇలాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన వైద్యులు టీకొట్టు యజమానికి ఆస్పత్రిని అప్పగించి మరోచోట ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.  స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులపైనా....టీ కొట్టు యజమాని పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

click me!