భారీగా డబ్బులు, కారు సీజ్: పోలీసుల అదుపులో తెనాలి టీడీపి నేతలు

Published : Dec 03, 2018, 07:08 AM IST
భారీగా డబ్బులు, కారు సీజ్: పోలీసుల అదుపులో తెనాలి టీడీపి నేతలు

సారాంశం

శేర్‌లింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్‌ప్రసాద్‌ కుమారుడు కారులో రూ. 70లక్షలున్నట్లు సమాచారం టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. 

హైదరాబాద్: గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సంఘం, పోలీసు విభాగం సిబ్బంది ఓ హోటల్ పై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి రూ.4.74 లక్షలు, కారు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారని టీఆర్ఎస్ సనత్ నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరులు ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తమపై దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. 

ఇదిలావుంటే, శేర్‌లింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్‌ప్రసాద్‌ కుమారుడు కారులో రూ. 70లక్షలున్నట్లు సమాచారం టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ  డబ్బును సీజ్‌ చేశారు. భవ్య సిమెంట్స్‌ డైరెక్టర్‌ శివకుమార్‌, కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ