ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ నివాళి.. సండ్ర గైర్హాజరు

Published : Jan 17, 2019, 12:23 PM ISTUpdated : Jan 17, 2019, 12:24 PM IST
ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ నివాళి.. సండ్ర గైర్హాజరు

సారాంశం

ఈ కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య  గైర్హజరయ్యారు.

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కి గురువారం ఎన్టీఆర్ ఘాట్ లో ఆ పార్టీ నేతలు నివాళులర్పించారు. కాగా.. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య  గైర్హజరయ్యారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

కాగా.. ఈ సమావేశాలకు ముందు టీడీపీ నేతలంతా ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి.. నివాళులర్పించారు. అయితే..ఈ కార్యక్రమంలో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గైర్హాజర్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.

 పార్టీ తరుపున కేవలం ఇద్దరే ఎమ్మెల్యేలు ఎన్నికవడం, అందులో ఒకరు గైర్హాజర్ కావడం పట్ల పలు ఊహగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల వల్ల తాను హైదరాబాద్‌కు రాలేదని, అంతేతప్ప ఇందులో వేరే ఉద్దేశమేమీ లేదని సండ్ర వివరణ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు