హైదరాబాద్ వరద బాధితులకు బాలయ్య అండ: కోటిన్నర విరాళం, బిర్యానీ పంపిణీ

By Siva KodatiFirst Published Oct 18, 2020, 8:46 PM IST
Highlights

సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పెద్దమనసు చాటుకున్నారు. హైదరాబాద్ వరద బాధితులకు రూ.కోటి 50 లక్షలు విరాళంగా ప్రకటించారు.

సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పెద్దమనసు చాటుకున్నారు. హైదరాబాద్ వరద బాధితులకు రూ.కోటి 50 లక్షలు విరాళంగా ప్రకటించారు. అలాగే వరదల కారణంగా రోడ్డు పక్కనున్న నివాసాలు కొట్టుకుపోయి నిరాశ్రయులైన వారికి బాలయ్య అండగా నిలిచారు.

అదేవిధంగా పాతబస్తీలో బసవతారక రామా సేవా సమితి ఆధ్వర్యంలో 1000 కుటుంబలాకు బిర్యానీ ఏర్పాటు చేసి వారికి పంపించారు. ఆదివారం సాయంత్రం బాధిత కుటుంబాలకు వాటిని పంపిణీ చేశారు బాలయ్య.

కాగా, నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నదికి రెండు వైపులా రెయిలింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించించింది.

ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నది వరద పరిస్థితిని డ్రోన్ల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ పరిశీలన చేసిన అధికారులు నదికి రెండు వైపులా ఎక్కడ రెయిలింగ్ ఏర్పాటు చేయాలనే విషయాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. ఈ మేరకు మూసీ రివర్ బోర్డు ఛైర్మెన్ సుధీర్ రెడ్డి ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు.

click me!