అప్పుడే కేసీఆర్ రంగు బయటపడింది.. రావుల

Published : Dec 05, 2018, 01:50 PM IST
అప్పుడే కేసీఆర్ రంగు బయటపడింది.. రావుల

సారాంశం

అధికారం విషయానికి వచ్చే సరికి తన కుటుంబం మాత్రమే అనుభవించాలనే దుర్భుద్ది కేసీఆర్ ది అని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమం కోసం..ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, కళాకారులు, కోదండరాం ఇలా అందరినీ కేసీఆర్ వాడుకున్నాడని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కానీ.. అధికారం విషయానికి వచ్చే సరికి తన కుటుంబం మాత్రమే అనుభవించాలనే దుర్భుద్ది కేసీఆర్ ది అని ఆయన మండిపడ్డారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంగరకలాన్ సభలో కేసీఆర్ అసలు రంగు బయటపడిందన్నారు. రాష్ట్రంలో 9,500 ఇళ్లు కట్టామని ఈటల చెప్పారని, తెలంగాణలో ఇళ్లు కావాల్సిన వాళ్లు ఎంతో మంది ఉన్నారని ఆయన అన్నారు. దళితులకు కేవలం పది వేల ఎకరాల భూమినే పంపిణీ చేశారని విమర్శించారు. పేదలకు డబుల్‌బెడ్‌ రూమ్ ఇళ్లు, దళితులకు భూమి ఇవ్వలేదని రావుల ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌