నేడు బాధ్యతలు చేపట్టనున్న కేటీఆర్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

By ramya neerukondaFirst Published Dec 17, 2018, 9:42 AM IST
Highlights

తెలంగాణ భవన్‌కు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అభిమానులు, శ్రేణులు భారీగా రానున్న తరుణంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రాఫిక్‌ను మళ్లీస్తునట్లు చెప్పారు.


టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు. తెలంగాణ భవన్‌కు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అభిమానులు, శ్రేణులు భారీగా రానున్న తరుణంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రాఫిక్‌ను మళ్లీస్తునట్లు చెప్పారు.

కేబీఆర్ పార్కు నుంచి ఒరిస్సా ఇస్‌లాండ్ వైపు వాహనాల రాకపోకలను అనుమతించరని, ఎన్టీఆర్ నుంచి ఒరిస్సా ఇస్‌లాండ్ వరకు వచ్చే వాహనాలను క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా రోడ్ నెం 10 జహీరానగర్ వైపు దారి మళ్లీస్తునట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఒరిస్సా ఇస్‌లాండ్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వైపు వచ్చే వాహనదారులు అపోలో దవాఖాన మీదుగా ఫిలింనగర్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, ఎన్టీఆర్ భవన్ మీదుగా దారి మళ్లీస్తున్నట్లు పేర్కొన్నారు.

జహీరానగర్ నుంచి ఒరిస్సా ఇస్‌లాండ్ వైపు వెళ్లే వాహనాలను రోడ్ నెం. 10, రోడ్ 1/12 జంక్షన్ కమాన్, ఏసీబీ కార్యాలయం మీదుగా ఒరిస్సా ఇస్‌లాండ్‌కు దారిమళ్లీస్తున్నారు. రోడ్డు నెం. 45 ఫిలింనగర్ జంక్షన్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్‌కు పోయే వాహనాలు జూబ్లిహిల్స్ చెక్‌పోస్టు మీదుగా ఎన్టీఆర్ భవన్ , క్యాన్సర్ హాస్పిటల్ వైపు దారి మళ్లీస్తున్నట్లు తెలిపారు.
 

click me!