
హైదరాబాద్: TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ Rohith reddy గురువారం నాడు భేటీ అయ్యారు. Tandurలో చోటు చేసుకొన్న పరిణామాలపై కేటీఆర్ కు పైలెట్ రోహిత్ రెడ్డి వివరించారు. తాండూరులోని పరిస్థితులపై కేటీఆర్ ఆరా తీశారు. తాండూరులో జరగుతున్న పరిణామాలను పైలెట్ రోొహిత్ రెడ్డి KTRదృష్టికి తీసుకెళ్లారు.
ఈ నెల ఈ నెల 23న తాండూరులో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులతో కూర్చొన్నా కూడా సీఐ రాజేందర్ రెడ్డి వారించలేదనే ఆగ్రహంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫోన్ చేసి దూషించారనే ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఆడియో ఆధారంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై తాండూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు Mahender Reddyపై కేసు నమోదు చేశారు. ఈ విషయమై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. సీఐని దూషించినట్టుగా చెబుతున్న ఆడియో తనది కాదన్నారు.ఈ విషయమై తాను చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు.. తనక పోలీసులు అంటే గౌరవమని చెప్పారు.
ఈ వ్యవహరం వెనుక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హస్తం ఉందని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఇద్దరిని పార్టీ వర్కింగ్ ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలిపించి మాట్లాడారు. అయితే కొంత కాలంగా ఇరువురి మధ్య సఖ్యత ఉన్నట్టుగానే కప్నించింది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవరగంలో, పార్టీపై తమ పట్టును నిలుపుకొనేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తమ వర్గాన్ని రోహత్ రెడ్డి వర్గం అణగ దొక్కే ప్రయత్నం చేస్తుందని మహేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మ వర్గానికి చెంిన ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టిస్తున్నారన్నారు. అంతేకాదు సర్పంచ్ లను పదవుల నుండి కూడా తొలగిస్తున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో తాండూరు నుండి తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా మహేందర్ రెడ్డి ఇటీవలనే ప్రకటించారు. ఇవాళ మీడియా సమావేశంలో కూడా మహేందర్ రెడ్డి ఇదే వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ తనకే టికెట్ ఇస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తానని చెబుతూనే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.