రెండో రోజూ ఈడీ విచారణ: హాజరైన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

By narsimha lode  |  First Published Dec 20, 2022, 3:01 PM IST

తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి రెండో రోజున విచారణకు హాజరయ్యారు. నిన్న   రోహిత్ రెడ్డిని ఆరు గంటల పాటు  ఈడీ అధికారులు విచారించారు. 


హైదరాబాద్: రెండో  రోజున ఈడీ విచారణకు  మంగళవారంనాడు మధ్యాహ్నం  తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఇవాళ ఉదయం  పదిన్నర గంటలకు  హాజరు కావాలని ఈడీ అధికారులు  రోహిత్ రెడ్డిని కోరారు.నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటలకు  పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. నిన్న ఆరు గంటల పాటు ఆయనను విచారించారు.  అయ్యప్ప దీక్షలో ఉన్నందున  పూజ, భిక్ష పూర్తైన తర్వాత  విచారణకు హాజరౌతానని ఈడీ అధికారులకు  పైలెట్ రోహిత్ రెడ్డి  సమాచారం ఇచ్చారు. 

నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటలకు  పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. నిన్న ఆరు గంటల పాటు ఆయనను విచారించారు.  అయ్యప్ప దీక్షలో ఉన్నందున  పూజ, భిక్ష కార్యక్రమం  తర్వాత  విచారణకు హాజరౌతానని ఈడీ అధికారులకు  పైలెట్ రోహిత్ రెడ్డి  సమాచారం ఇచ్చారు. ఇవాళ ఉదయం   పైలెట్ రోహిత్ రెడ్డి తన చార్టెడ్ అకౌంటెంట్ తో  చర్చించారు.  ఈడీ అధికారులు అడిగిన  సమాచారానికి సంబంధించిన  డాక్యుమెంట్లను  పైలెట్ రోహిత్ రెడ్డి సీఏ వద్ద తీసుకున్నారు. ఇవాళ ఈడీ విచారణకు వచ్చిన  సమావేశానికి ఈ డాక్యుమెంట్లతో  హాజరయ్యారు.

Latest Videos

undefined

నిన్న ఆరుగంటల పాటు జరిగిన విచారణలో కేవలం తన బయోడేటా గురించి  మాత్రమే ఈడీ అధికారులు అడిగారని పైలెట్ రోహిత్ రెడ్డి  చెప్పారు. తనను ఏ కేసులో విచారణ చేస్తున్నారో చెప్పాలని పదే పదే అడిగినా కూడా తనకు  ఈడీ అధికారులు సమాచారం ఇవ్వలేదన్నారు. తన వ్యాపారాలు,కుటుంబ సభ్యుల సమాచారాన్ని మాత్రమే ఈడీ అధికారులు అడిగినట్టుగా  పైలెట్ రోహిత్ రెడ్డి  చెప్పారు. ఇవాళ  ఎన్ని గంటలపాటు ఈడీ అధికారులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని విచారిస్తారో  చూడాలి.  ఏ కేసుకు సంబంధించి  విచారణ చేస్తున్నారో  పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ నుండి బయటకు వచ్చిన తర్వాత తెలిసే అవకాశం ఉంది.

మొయినాబాద్ ఫాంహౌస్ లో  బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించి  రోహిత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.  నిందితులను ట్రాప్ చేయడంలో రోహిత్ రెడ్డి చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.  ఈ కారణంగానే పైలెట్ రోహిత్ రెడ్డిని  టార్గెట్ చేశారని  బీజేపీపై  బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఈ ఆరోపణలను  బీజేపీ నేతలు తోసిపుచ్చుతున్నారు.  ఈడీ, ఐటీ వంటి సంస్థల దర్యాప్తులకు తమ పార్టీకి సంబంధం లేదని  బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. 

also read:నా బయోడేటా, వ్యాపారాల గురించి ఈడీ ఆరా: ఆరు గంటల పాటు పైలెట్ రోహిత్ రెడ్డి విచారణ

ఈ నెల 16వ తేదీన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల  19న విచారణకు రావాలని ఆదేశించారు. అయితే  తనకు  ఈ నెల  31 వరకు సమయం ఇవ్వాలని రోహిత్ రెడ్డి  కోరారు. ఈ విషయమై  ఈడీ అధికారులకు తన పీఏ ద్వారా లేఖను పంపారు రోహిత్ రెడ్డి. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సమయం ఇచ్చేందుకు ఈడీ అధికారులు  నిరాకరించారు.దీంతో  నిన్న మధ్యాహ్నం  తొలి రోజు  రోహిత్ రెడ్డి  విచారణకు హాజరయ్యారు.నిన్నటి విచారణకు కొనసాగింపుగానే ఇవాళ కూడా రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించనున్నారు.


 


 


 

click me!