అబివృద్దిపై పోటీ పడాలి: విపక్షాలకు మంత్రి కేటీఆర్ సూచన

By narsimha lode  |  First Published Dec 20, 2022, 1:59 PM IST

తమపై విమర్శలు మానుకొని అభివృద్దిలో  పోటీపడాలని తెలంగాణ మంత్రి కేటీఆర్  విపక్షాలకు సూచించారు.  రాజన్న సిరిసిల్లలో  పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.


సిరిసిల్ల:దమ్ముంటే అభివృద్దిలో తమతో పోటీ పడాలని  తెలంగాణ మంత్రి కేటీఆర్ విపక్షాలకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో  కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని మంగళవారంనాడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా  నిర్వహించిన సభలో ఆయన  ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు  ఒట్టిమాటలు చెబుతున్నారన్నారు. కానీ తమ ప్రభుత్వం  ఎన్నికల్లో  ఇచ్చిన వాగ్ధానాలతో పాటు ఇతర కార్యక్రమాలను చేసిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. 

తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకంటే  అదనంగా  రెండు పనులు చేసి తమను విమర్శించాలని విపక్షాలకు మంత్రి సూచించారు.  మంచి పనులు చేసి  ప్రజల మనసు గెలుచుకోవాలని  మంత్రి  కోరారు. కేసీఆర్ ను తిట్టడం మానుకొని మంచి పనులు చేసేందుకు ముందుండాలని  విపక్షాలకు మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. ఉదయం లేచింది మొదలు తమను తిట్టడమే పనిగా విపక్షాలు పెట్టుకున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. 

Latest Videos

రైతు బంధు, రైతు భీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని మంత్రి కేటీఆర్  చెప్పారు.బీడి కార్మికులకు  పెన్షన్ అందిస్తున్న రాష్ట్రం కూడా  తెలంగాణేననిి మంత్రి కేటీఆర్ వివరించారు. వేములవాడ పట్టణాన్ని అద్భుతమైన పట్టణంగా  రూపుదిద్దుతున్నట్టుగా మంత్రి చెప్పారు. ప్రతి ఇంటికి  మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందిస్తున్నట్టుగా  ఆయన తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత  24 గంటల పాటు విద్యుత్ ను అందించినట్టుగా మంత్రి చెప్పారు.తమ కంటే ప్రభుత్వాలను నడిపిన నేతలు  ఎందుకు  తమ మాదిరిగా ప్రజలకు పథకాలు అందించలేదో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 
 

click me!