మేం తలుచుకొంటే... బాబు, బాలయ్యలపై తలసాని పరోక్ష వ్యాఖ్యలు

Published : Dec 03, 2018, 01:18 PM ISTUpdated : Dec 03, 2018, 01:21 PM IST
మేం తలుచుకొంటే... బాబు, బాలయ్యలపై తలసాని పరోక్ష వ్యాఖ్యలు

సారాంశం

మేం తలుచుకొంటే  ఇక్కడ ఎవరూ కూడ ప్రచారం చేయలేరని  తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.


హైదరాబాద్: మేం తలుచుకొంటే  ఇక్కడ ఎవరూ కూడ ప్రచారం చేయలేరని  తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.

సోమవారం నాడు  ఆయన  మీడియాతో మాట్లాడారు.తెనాలి ఎమ్మెల్యే అనుచరులు డబ్బులు పంచుతూ  దొరికారని చెప్పారు.ప్రాంతీయ విద్వేషాలను చంద్రబాబు ఎందుకు రెచ్చగొడుతున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 

సమాజానికి చంద్రబాబునాయుడు ఏం మేసేజ్ చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎవరైనా వచ్చి ప్రచారం చేసే హక్కుందన్నారు. కానీ, చిల్లర రాజకీయాలు చేయకూడదన్నారు. శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి డబ్బుతో దొరికితే  మీడియాలో ఆయన పేరు చెప్పలేదన్నారు ఇంకా 8 మంది వద్ద డబ్బులున్నాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం