భారత్ నుండి నన్ను వెళ్లగొట్టే ధైర్యం ఎవరికీ లేదు: అసద్

By narsimha lodeFirst Published Dec 3, 2018, 1:09 PM IST
Highlights

తనను భారత్ నుండి ఎవరూ కూడ వెళ్లగొట్టే దమ్ము, ధైర్యం లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు

హైదరాబాద్: తనను భారత్ నుండి ఎవరూ కూడ వెళ్లగొట్టే దమ్ము, ధైర్యం లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై  అసదుద్దీన్ ఘాటుగా స్పందించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాడు తెలంగాణలోని పలు  నియోజకవర్గాల్లో  యోగి  ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంఐఎం చీఫ్  అసద్‌పై యోగి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే  అసద్  ఇక్కడి నుండి పారిపోవాల్సి వస్తోందని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై అసద్  ఘాటుగానే  స్పందించారు.  ఇండియా తన తండ్రి దేశం. స్వర్గం నుంచి భూమి మీదకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఆడమ్‌ అని ఇస్లాం నమ్ముతుందన్నారు.  ఆయన మొదట వచ్చింది కూడా ఇండియాకే. కాబట్టి ఇది నా తండ్రి దేశం అందుకే ఇక్కడి నుంచి నన్ను ఎవ్వరూ ఎక్కడికీ పంపలేరన్నారు.
 
చరిత్ర తెలుసుకొని యోగి ఆదిత్యనాథ్ మాట్లాడాలని  అసద్ సూచించారు. మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హైదరాబాద్‌ను విడిచి పారిపోలేదు. రాజ్‌ప్రముఖ్‌గా సేవలు అందించారు. 

చైనాతో యుద్ధం జరిగినపుడు తన బంగారమంతా దానం చేస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి. అయినా సొంత రాష్ట్రంలో సరైన సదుపాయాలు లేక 150 మంది చిన్నారులు చనిపోతే ఏమీ చేయలేని అసమర్థ సీఎం తన మాటలతో నన్ను బెదిరించలేరన్నారు.

సంబంధిత వార్తలు

నేను అమ్ముడుపోయే రకం కాదు: అసద్

మజ్లిస్‌కు కాంగ్రెస్ రూ.25 లక్షల ఆఫర్ (ఆడియో)

అసద్‌కు మహేశ్వర్ రెడ్డి కౌంటర్: నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటా

రూ.25 లక్షల ఆఫర్: కాంగ్రెస్‌పై అసదుద్దీన్ సంచలన ఆరోపణలు

click me!