కేటీఆర్ తో భేటీ: అదేమిటో చెప్పనన్న యాంకర్ సుమ

Published : Dec 28, 2018, 03:14 PM ISTUpdated : Dec 28, 2018, 03:17 PM IST
కేటీఆర్ తో భేటీ: అదేమిటో చెప్పనన్న యాంకర్ సుమ

సారాంశం

ఓ మంచి పని కోసం తాను కేటీఆర్ ను కలిసినట్లు సుమ తెలిపారు. ఆ మంచి పనేమిటో ఆమె చెప్పడానికి నిరాకరించారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలూ చెబుతానని ఆమె అన్నారు. 


హైదరాబాద్: యాంకర్ సుమ శుక్రవారంనాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిశారు. టీఆర్ఎస్ ఘన విజయం సాధించినందుకు ఆమె కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. 

ఓ మంచి పని కోసం తాను కేటీఆర్ ను కలిసినట్లు సుమ తెలిపారు. ఆ మంచి పనేమిటో ఆమె చెప్పడానికి నిరాకరించారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలూ చెబుతానని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఆమె కేటీఆర్ ను కలిశారు.

రామ్ చరణ్ తేజ్ నటించి వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సుమ యాంకర్ గా వ్యవహరించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ వేడుకకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమయంలో కేటీఆర్ ను సుమ ప్రశంసలతో ముంచెత్తారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!