ముగిసిన #Tahsildar Vijaya Reddy అంత్యక్రియలు

By sivanagaprasad KodatiFirst Published Nov 5, 2019, 5:45 PM IST
Highlights

దుండగుడి దాడిలో తన కార్యాలయంలోనే సజీవదహనమైన రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ అంత్యక్రియలు పూర్తి అధికారిక లాంఛనాలతో ముగిశాయి. హైదరాబాద్ కొత్తపేటలోని ఆమె నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. 

దుండగుడి దాడిలో తన కార్యాలయంలోనే సజీవదహనమైన రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ అంత్యక్రియలు పూర్తి అధికారిక లాంఛనాలతో ముగిశాయి. హైదరాబాద్ కొత్తపేటలోని ఆమె నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది.

అంతకుముందు విజయారెడ్డి భౌతికకాయానికి వివిధ పార్టీల నేతలు, ఉద్యోగ సంఘాలు, స్థానికులు నివాళులర్పించారు. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్దఎత్తున ఉద్యోగులు, ప్రజలు తరలిరావడంతో విజయారెడ్డి నివాస ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

కొత్తపేట నుంచి ఆమె నివాసం నుంచి నాగోల్ స్మశాన వాటిక వరకు అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం విజయారెడ్డికి హిందూ సాంప్రదాయ ప్రకారం ఆమె భర్త అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డి డ్రైవర్ గురునాథం మంగళవారం నాడు డిఆర్‌డిఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Also read:tahsildar Vijaya Reddy: అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించానని సురేష్

సోమవారం నాడు అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.మంటల్లో చిక్కుకొన్న ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ గురునాథం తీవ్రంగా ప్రయత్నించాడు.

ఈ ఘటనలో గురునాథానికి 80 శాతం గాయాలయ్యాయి. దీంతో ఆయనను డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం నాడు ఉదయం మృతి చెందాడు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని  అబ్దుల్లాపూర్‌మెట్టు తహసీల్దార్ కార్యాలయంలోకి ఓ దుండగుడు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వచ్చాడు.తహసీల్దార్ విజయారెడ్డితో మాట్లాడాలంటూ ఆమె చాంబర్‌లోకి వెళ్లాడు. తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లిన ఆ దుండగుడు ఆమెపై పెట్రోల్ పోశాడు. వెంటనే ఆమెకు నిప్పంటించాడు.

అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు  విజయారెడ్డిపై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దీంతో విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్య ప్రయత్నించారు. డ్రైవర్ గురునాథం 80 శాతం కాలిపోయాడు. చంద్రయ్య 60 శాతం కాలిపోయాడు.

Also Read:విజయారెడ్డి హత్య వెనుక టీఆర్ఎస్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సూర్యాపేట జిల్లాకు చెందిన గురునాథం సుమారు ఆరు ఏళ్లుగా పనిచేస్తున్నాడు. విజయారెడ్డిని తన సోదరిగా గురునాథం భావించాడు. దీంతో ఆమె గురునాథాన్నే తన డ్రైవర్ గా కొనసాగించింది. 

డ్రైవర్ గురునాథం విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన క్రమంలో తీవ్రంగా గాయపడ్డారు. గురునాథం కుటుంబం చాలా పేద కుటుంబం. విజయారెడ్డి కుటుంబంలో సభ్యుడిగా గురునాథం ఉండేవాడని ఆ కుటుంబానికి చెందిన వాళ్లు చెబుతున్నారు. 

click me!