అధిక ఫీజులు వసూలు చేస్తున్న 15 కాలేజీలకు జరిమానా విధిస్తూ ఫీజుల నియంత్రణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 26 కాలేజీలపై ఫిర్యాదులు అందాయి.
హైదరాబాద్: అధిక ఫీజులు వసూలు చేస్తున్న 15 కాలేజీలకు ఫైన్ విధిస్తూ ఫీజుల నియంత్రణ కమిటీ ఆదేశించింది.తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల వసూలు విషయమై ప్రభుత్వం జీవోను జారీ చేసింది.ఈ జీవోకు భిన్నంగా ఫీజులు వసూలు చేస్తున్నారని సుమారు 26 ఇంజనీరింగ్ కాలేజీలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.ఈ ఫిర్యాదులపై ఫీజుల రెగ్యులైజేషన్ కమిటీ సీరియస్ గా తీసుకుంది. 15 ఇంజనీరింగ్ కాలేజీలకు జరిమానా విధిస్తూ ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయం తీసుకొంది. మిగిలిన కాలేజీల విషయమై కూడా కమిటీ విచారణ చేయనుంది. అధిక ఫీజులు వసూలు చేసిన కాలేజీలకు ఒక్కో విద్యార్ధికి రూ. 2 లక్షల చొప్పున జరిమానాను పీజుల నియంత్రణ కమిటీ విధించనుంది. అధిక ఫీజులు చెల్లించిన విద్యార్ధులకు తిరిగి ఫీజుల నియంత్రణ కమిటీ చెల్లించేలా చర్యలు తీసుకుంటుంది.