పేదోళ్లకు గూడు లేదు కానీ కేసీఆర్ కు మాత్రం విలాసవంతమైన భవనమా...?: టీ టీడీపీ నేత ఎల్ రమణ

Published : Aug 26, 2019, 01:17 PM IST
పేదోళ్లకు గూడు లేదు కానీ కేసీఆర్ కు మాత్రం విలాసవంతమైన భవనమా...?: టీ టీడీపీ నేత ఎల్ రమణ

సారాంశం

కేసీఆర్ ప్రగతిభవన్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపించారు. కానీ పేదవాడు మాత్రం ఉండటానికి ఇళ్లు లేక ఇబ్బందిపడుతున్నారని చెప్పుకొచ్చారు. దివంగత సీఎం ఎన్టీఆర్ పేదలకు పక్కా ఇళ్లు పథకాన్ని ప్రారంభించారని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అందించడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. 

రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నతెలంగాణ రాష్ట్రంలో పేదళ ఇళ్లకు మోక్షం కలగడం లేదని విమర్శించారు. పేదలకు ప్రయోజనాలు కలిగించే ఏ ఒక్క పథకం అమలు కావడం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రగతిభవన్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపించారు. 

కానీ పేదవాడు మాత్రం ఉండటానికి ఇళ్లు లేక ఇబ్బందిపడుతున్నారని చెప్పుకొచ్చారు. దివంగత సీఎం ఎన్టీఆర్ పేదలకు పక్కా ఇళ్లు పథకాన్ని ప్రారంభించారని చెప్పుకొచ్చారు. ఆ పథకాన్ని మాజీ సీఎం చంద్రబాబు అమలు చేశారని కొనియాడారు. 

కానీ కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లు అంటూ ఏవేవో చెప్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ ఆరేళ్ల పాలనపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్ కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. 

ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రోజురోజుకూ పాతళంలోకి వెళ్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతిపేద బిడ్డకు ఇల్లు వచ్చే వరకు తెలంగాణ టీడీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 

రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తాము పర్యటిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఆస్తుల కోసం పాకులాడలేదని చెప్పుకొచ్చారు. దివంగత సీఎం ఎన్టీఆర్ స్ఫూర్తితో  చంద్రబాబు అండతో పేదల కోసం పోరాటం చేస్తుందని ఎల్ రమణ తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!