కేసీఆర్ కేబినెట్ లో సండ్ర..? : అమరావతికి టీ-టీడీపీ నేతలు

Published : Feb 15, 2019, 05:43 PM ISTUpdated : Feb 15, 2019, 05:45 PM IST
కేసీఆర్ కేబినెట్ లో సండ్ర..? : అమరావతికి టీ-టీడీపీ నేతలు

సారాంశం

అలాగే సండ్ర వెంకట వీరయ్య తెలుగుదేశం పార్టీ వీడి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే అంశంపై చర్చించనున్నారు. ఇకపోతే కేసీఆర్ కేబినేట్ లో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు బెర్త్ కన్ఫమ్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. 

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు అమరావతికి పయనమవ్వనున్నారు. సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతల అమరావతి టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. 

మరోవైపు శనివారం అమరావతిలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకే  అమరావతి వెళ్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నామా నాగేశ్వరరావులు అమరావతి బయలుదేరనున్నారు. 

అమరావతిలో జరగబోయే టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఇరు రాష్ట్రాల పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై చర్చించనున్నారు. అలాగే జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం అనుసరిస్తున్న విధానంపై ప్రజల నుంచి వస్తున్న స్పందనపై చంద్రబాబు ఆరా తియ్యనున్నట్లు తెలుస్తోంది. 
ఇకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి చెందడంపై కూడా చర్చించనున్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చెయ్యాలా లేక పొత్తులు పెట్టుకోవాలా అన్న అంశంపై కూడా చర్చించనున్నారు. 

కాంగ్రెస్ పార్టీతో పొత్తు తెలంగాణకే పరిమితం చెయ్యాలా లేక ఏపీలో కూడా కొనసాగించాలా అన్న అంశంపై కూడా విస్తృతంగా చర్చింనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో పార్టీ బలోపేతంపై కూడా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చెయ్యనున్నట్లు తెలుస్తోంది. 

అలాగే సండ్ర వెంకట వీరయ్య తెలుగుదేశం పార్టీ వీడి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే అంశంపై చర్చించనున్నారు. ఇకపోతే కేసీఆర్ కేబినేట్ లో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు బెర్త్ కన్ఫమ్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబుకు ఝలక్: కేసీఆర్ కేబినెట్లో సండ్ర?

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!