రాజేంద్రనగర్‌లో టీఆర్ఎస్‌కు షాక్: తండ్రీ కొడుకుల రాజకీయం

By narsimha lodeFirst Published Nov 8, 2018, 6:47 PM IST
Highlights

మైలార్‌దేవ్‌పల్లి టీఆర్ఎస్ కార్పోరేటర్‌ తోకల శ్రీనివాస్ రెడ్డి  రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సన్నాహలు చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది.


హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లి టీఆర్ఎస్ కార్పోరేటర్‌ తోకల శ్రీనివాస్ రెడ్డి  రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సన్నాహలు చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే  ప్రకాష్ గౌడ్ సోదరుడిపై  తోకల శ్రీనివాసర్ రెడ్డి విజయం సాధించారు. జీహెచ్ ఎం సీ ఎన్నికల ముందు తన తండ్రి శ్రీశైలం రెడ్డితో కలిసి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. అంతకుముందు  వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో  ఉండేవారు. 

2009, 2014 ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుండి ప్రకాష్ గౌడ్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ప్రకాష్ గౌడ్ టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. 

శ్రీశైలం రెడ్డి  కార్పోరేటర్‌గా విజయం సాధించిన తర్వాత రాజేంద్రనగర్‌ అసెంబ్లీ స్థానం  నుండి  పోటీ చేయడానికి సన్నాహలు చేసుకొంటున్నారు. అయితే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్‌లో చేరడం శ్రీనివాస్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బంది ఏర్పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రకాష్ గౌడ్‌కే  కేసీఆర్ టికెట్టు కేటాయించారు.

రాజేంద్రనగర్ నుండి టీఆర్ఎస్ టికెట్టు  కోసం  తోకల శ్రీనివాస్ రెడ్డి పెట్టుకొన్న ఆశలు నీరుగారిపోయాయి. దీంతో తోకల శ్రీశైలం రెడ్డి టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే బీజేపీ టికెట్టు బద్దం బాల్ రెడ్డికి కేటాయిండంతో  శ్రీశైలం రెడ్డి తన కొడుకు శ్రీనివాస్ రెడ్డిని రాజేంద్ర నగర్‌ నుండి  బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.ఈ విషయమై తన అనుచరులతో శ్రీనివాస్ రెడ్డి  అనుచరులతో మంతనాలు జరుపుతున్నారని ప్రచారం సాగుతోంది.

click me!