పరిపూర్ణానందపై బహిష్కరణ ఎత్తివేత.. నేడు నగరానికి రాక

By ramya neerukondaFirst Published Sep 4, 2018, 10:19 AM IST
Highlights

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పరిపూర్ణానంద స్వామి యాదగిరిగుట్ట వరకు ర్యాలీ నిర్వహించ తలపెట్టగా పోలీసులు నగర బహిష్కరణ విధించారని తెలిపారు.

శ్రీపీఠం అధ్యక్షుడు పరిపూర్ణానంద స్వామిపై నగర పోలీసులు విధించిన నగర బహిష్కరణ ఎత్తివేయడం జరిగింది. న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో.. ఈ రోజు ఆయన హైదరాబాద్ నగరంలోకి తిరిగి అడుగుపెట్టనున్నారు.  సినీ క్రిటిక్ కత్తి మహేష్ విషయంలో.. మొదట వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో శాంత్రి భద్రతలను నెలకొనేందుకు నగర పోలీసులు కత్తి మహేష్, పరిపూర్ణానంద స్వామిపై ఆరు నెలలపాటు బహిష్కరణ విధించారు.

పరిపూర్ణానంద స్వామి మంగళవారం నగరానికి వస్తున్న సందర్భంగా పెద్దఎత్తున స్వాగత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్‌ వెల్లడించింది. ఈ నెల 4న విజయవాడలో శ్రీకనకదుర్గా ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం హైదరాబాద్‌కు బయల్దేరతారని, మార్గమధ్యలో కోదాడ నుంచి నగరంలోకి ప్రవేశిస్తారని తెలిపారు.

సోమవారం హైదర్‌గూడలోని  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ట్ర అధ్యక్షుడు రామరాజు, భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ భగవంతరావు మాట్లాడారు. సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పరిపూర్ణానంద స్వామి యాదగిరిగుట్ట వరకు ర్యాలీ నిర్వహించ తలపెట్టగా పోలీసులు నగర బహిష్కరణ విధించారని తెలిపారు. దీనిపై హైకోర్టులో పిటిషన్‌ వేయగా నగర బహిష్కరణను కొట్టి వేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో నగరానికి వస్తున్న స్వామికి ఘనంగా స్వాగతం పలకనున్నట్టు చెప్పారు. ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, బషీర్‌బాగ్‌ ప్రాంతాల్లో ఘన స్వాగతం పలుకుతామన్నారు.

click me!