సూర్యాపేట ప్రమాదం: గ్యాలరీ డెకరేషన్ నిర్వాహకులపై కేసు

Published : Mar 23, 2021, 12:21 PM IST
సూర్యాపేట ప్రమాదం: గ్యాలరీ డెకరేషన్ నిర్వాహకులపై కేసు

సారాంశం

సూర్యాపేట జాతీయ కబడ్డీ పోటీల సందర్భంగా కూలిన గ్యాలరీ డికరెషన్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు సంఘటనపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.

సూర్యాపేట: తెలంగాణలోని సూర్యాపేటలో జాతీయ కబడ్డీ పోటీల సందర్భంగా జరిగిన ప్రమాదంలో దాదాపు వంద మంది గాయపడ్డారు. వారిలో 20 మంది పరిస్థితి ఆందోలనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని హైదరాబాదులోని ఆస్పత్రులకు తరలించారు. 

సోమవారంనాడు జాతీయ కబడ్డీ పోటీల సందర్భంగా స్టేడియం గ్యాలరీ కూలిన విషయం తెలిసిందే.  స్టేడియం గ్యాలరీ డెకరేషన్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు గ్యాలరీ నాసిరకం సామర్థ్యం వల్లనే ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. 

సామర్థ్యానికి మించి కబడ్డీ అభిమానులు రావడం వల్ల గ్యాలరీ కూలినట్లు తెలుస్తోంది.  నాణ్యతా లోపం వల్లనే ప్రమాదం జరిగిందని బాధితులు అంటున్నారు. గాయపడినవారిలో చాలా మందికి ఒళ్లంతా ఫ్రాక్చర్స్ అయినట్లు చెబుతున్నారు.

మూడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒకటి మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 500 మంది కోసం దాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అయితే, 1500 మంది దాకా రావడంతో ప్రమాదం జరిగిందని కూడా చెబుతున్నారు.

క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు కొంత మంది కాళ్లూ చేతులు విరిగిపోయినట్లు తెలుస్తోంది, కూలిన గ్యాలరీ మెటిరీయల్ ను అక్కడి నుంచి తరలిస్తున్నారు. మిగతా గ్యాలరీలను కూడా తీసేయాలని నిర్వాహకులు నిర్ణయించుకున్నారు.

సంఘటనపై విచారణ జరుగుతోందని జగదీష్ రెడ్డి అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఈ పోటీలను నిర్వహిస్తోందని ఆయన చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Padma Awards 2026 : తెలంగాణకు 7, ఏపీకి 4 పద్మ అవార్డులు.. ఆ 11 మంది ఎవరంటే?
Nampally Fire Breaks Out: ఘటనా స్థలాన్ని పరిశీలించిన MLA రాజాసింగ్ | Asianet News Telugu