వందేళ్ల అనుబంధాన్ని వదిలి టీఆర్ఎస్ లో చేరా:మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి

By rajesh yFirst Published Sep 12, 2018, 6:07 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని మాజీ స్పీకర్ టీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సమక్షంలో సురేష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ కండువా కప్పి సురేష్ రెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని మాజీ స్పీకర్ టీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సమక్షంలో సురేష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ కండువా కప్పి సురేష్ రెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

ఎన్నికల అనంతంరం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని సురేష్ రెడ్డిని ప్రజలు మరచిపోయే సమయంలో కేసీఆర్ తనకు ఒక చక్కటి అవకాశం ఇచ్చారని సురేష్ రెడ్డి అన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరానని సురేష్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో కానీ పరిపానలో వచ్చిన మార్పులు చూసి మూడు తరాలు, వందేళ్ల అనుబంధాన్ని వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో 1989 నుంచి పరిచయం ఉందన్న సురేష్ రెడ్డి 30 ఏళ్ల రాజకీయంలో వేర్వేరు పార్టీల్లో వేర్వేరు వేదికలపై ఉన్నా కేసీఆర్ వ్యాఖ్యలు తనకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. 

1996 అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణపై వాయిదా తీర్మానం పెట్టింది తానేనని గుర్తు చేశారు సురేష్ రెడ్డి. ఆరోజు కేసీఆర్ తనను అభినందించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అనేక ఉద్యమాల ఫలితంగా ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడిందన్నారు. ఈనాలుగున్నరేళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారని, ప్రాజెక్టుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కొనియాడారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలు చేరేందుకు కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయితీల రూపకల్పన చేయడం శుభపరిణామం అన్నారు. 

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బలమైన నాయకత్వంలో పనిచెయ్యాలని నిర్ణయించుకున్నానని అందుకే టీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. అభివృద్ధి కోసం పాటుపడుతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని అభివృద్ధి కోసం రేస్ గుర్రంలా పరుగెడుతున్న టీఆర్ఎస్ పార్టీతోనే తాను ఉంటానని స్పష్టం చేశారు. 

మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో కుస్తీ పోటీలను తలపించేలా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కొన్ని పార్టీలు పనిచేస్తున్నాయంటూ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక పొత్తులు పెట్టుకుంటున్నారని ఆ పొత్తులు ఆమోద యోగ్యమైనవి కావన్నారు. 

click me!