అవహేళన చేసినందుకే కాల్పులు: ఆబిడ్స్ ఎస్‌బీఐలో కాల్పులపై సర్ధార్ ఖాన్

By narsimha lodeFirst Published Jul 15, 2021, 3:49 PM IST
Highlights

ఆబిడ్స్ ఎస్బీఐ బ్యాంకులో కాల్పుల  కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తనను అవహేళన చేసినందుకే కాల్పులకు దిగాల్సి వచ్చిందని సెక్యూరిటీ గార్డు సర్దార్ ఖాన్ పోలీసుల విచారణలో చెప్పారు. సర్ధార్ ఖాన్, సురేందర్ మధ్య కొంతకాలంగా బేదాభిప్రాయాలున్నాయని పోలీసులు గుర్తించారు
 


హైదరాబాద్: తనను అవహేళన చేసినందుకే  సురేందర్ పై కాల్పులకు దిగినట్టుగా  ఎస్బీఐ సెక్యూరిటీ గార్డు సర్ధార్ ఖాన్  పోలీసుల విచారణలో తేల్చి చెప్పారు.హైద్రాబాద్ నగరంలోని ఆబిడ్స్ గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సురేందర్ పై కాల్పులకు దిగిన సెక్యూరిటీ గార్డు సర్ధార్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 14న  ఆబిడ్స్ ఎస్బీఐ బ్యాంకులో పనిచేసే సెక్యూరిటీ గార్డు సర్దార్ ఖాన్ సహచర ఉద్యోగి సురేందర్ పై కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో సురేందర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. గత కొంతకాలంగా సర్ధార్ ఖాన్, సురేందర్ మధ్య  బేదాభిప్రాయాలున్నాయి. సురేందర్ తరచుగా తనను అవహేళన చేసేలా మాట్లాడేవాడని సర్ధార్ ఖాన్  పోలీసుల విచారణలో చెప్పారని సమాచారం.  

also read:వారిద్దరూ మంచి స్నేహితులు, కాల్పులకు కారణం అదే: ఆబిడ్స్ ఎస్‌బీఐ కాల్పులపై పోలీసులు

సురేందర్ పై సర్ధార్ ఖాన్ మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. అయితే ఇందులో ఒక్క బుల్లెట్ మాత్రమే సురేందర్ కు తగిలిందని పోలీసుల తమ విచారణలో గుర్తించారు. మిగిలిన రెండు బుల్లెట్లు అక్కడే ఉన్న గోడకు తగిలాయని పోలీసులు చెప్పారు.సర్ధార్ ఖాన్ వద్ద ఉన్న తుపాకీని పోలీసులు సీజ్ చేశారు.

click me!