సురభి వాణీదేవి ఎమ్మెల్సీగా ప్రమాణం: ప్రమాణం చేయించిన ప్రొటెం ఛైర్మెన్

Published : Aug 29, 2021, 02:11 PM ISTUpdated : Aug 29, 2021, 02:13 PM IST
సురభి వాణీదేవి ఎమ్మెల్సీగా ప్రమాణం: ప్రమాణం చేయించిన ప్రొటెం ఛైర్మెన్

సారాంశం

సురభివాణీదేవి ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు . ఈ ఏడాది మార్చి మాసంలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి విజయం సాధించారు. శాసనమండలి ప్రొటెం ఛైర్మెన్ భూపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు.


హైదరాబాద్:  సురభి వాణీదేవి  ఎమ్మెల్సీగా ఆదివారం నాడు ప్రమాణం చేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి  విజయం సాధించారు. శాసనమండలిలోని తన ఛాంబర్‌లో ప్రొటెం ఛైర్మెన్ భూపాల్ రెడ్డి సురభి వాణీదేవితో  ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు. 

ఈ కార్యక్రమంలో ఎంపీ కే కేశవరావు, మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ, వేముల ప్రశాంత్ రెడ్డిలు పాల్గొన్నారు.  సురభి వాణీదేవి మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె.  హైద్రాబాద్ రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధిగా సురభి వాణీదేవి పోటీ చేసి విజయం సాధించారు.

టీఆర్ఎస్  చివరి నిమిషంలో వాణీదేవిని బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్ధి  రామచందర్ రావుపై ఆమె విజయం సాధించారు. సురభి వాణీదేవికి 1,89,339 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్ధికి 1,37,566 ఓట్లు వచ్చాయి. హైద్రాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల గ్రాడ్యుయేట్స్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  విజయం కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu