ఎమ్మెల్సీగా గెలిచిన వాణీదేవి.. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీజేపీ

By Siva KodatiFirst Published Mar 20, 2021, 5:15 PM IST
Highlights

తెలంగాణలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొదటి రిజల్ట్ వచ్చింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి గెలుపొందారు.

సుదీర్ఘంగా జరిగిన కౌంటింగ్, ఎలిమినేషన్, ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత వాణీ దేవి గెలిచినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రతి దశలోనూ వాణీదేవి ముందంజలో వున్నారు. దాదాపు 11,703 ఓట్ల ఆధిక్యాన్ని ఆమె పొందినట్లుగా సమాచారం.

కొన్ని దశల్లో రెండోస్థానంలో వున్న బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు గట్టి పోటి ఇచ్చినప్పటికీ.. చివరికి వాణీదేవి పైచేయి సాధించారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానంలో ఇప్పటి వరకు 93 మంది అభ్యర్ధుల్లో 91 మంది ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవికి 1,49,269 ఓట్లు బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావుకు 1,37,566 ఓట్లు, కె.నాగేశ్వర్‌కు 67,383 ఓట్లు వచ్చాయి. 

మరోవైపు నల్గొండ- ఖమ్మం- వరంగల్ స్థానంలోనూ టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. 

click me!