ఉండవల్లి ఫిర్యాదు: సుప్రీంకోర్టు పరిశీలనకు మార్గదర్శి కేసు

By pratap reddyFirst Published Oct 6, 2018, 7:12 AM IST
Highlights

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తోందని గతంలో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఫిర్యాదు నేపథ్యంలో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మార్గదర్శి యాజమాన్యం స్టే తెచ్చుకుంది.

న్యూఢిల్లీ: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ డిపాజిట్ల సేకరణ కేసు మరోసారి సుప్రీం కోర్టు పరిశీలనకు వచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తోందని గతంలో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఫిర్యాదు నేపథ్యంలో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మార్గదర్శి యాజమాన్యం స్టే తెచ్చుకుంది.

దిగువ కోర్టుల నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టు నుంచి కూడా మార్గదర్శి స్టే తెచ్చుకుంది. దీంతో విచారణ ఆగిపోయింది. అయితే ముఖ్యమైన కేసుల్లో ఆరు నెలలకు మించి స్టే ఉండకూడదనే సుప్రీంకోర్టు తీర్పు ఉన్న విషయం తెలిసిందే.  అందువల్ల మార్గదర్శి కేసు మరోసారి  సుప్రీం కోర్టు పరిశీలనకు వచ్చింది.

మరోసారి స్టే పొడగించాలనే మార్గదర్శి విజ్ఞప్తిని సుప్రీం కోర్టు నిరాకరించింది. కాగా, ఇదే వ్యవహారంపై అభిప్రాయం కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి, ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సుప్రీం నోటీసులు పంపింది.

click me!